చిరు బర్త్ డే…పవన్‌ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్..!

360
chiru pawan

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇటీవలె షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

ఇండిపెండెన్స్ డే కానుకగా మేకింగ్ వీడియోని విడుదల చేసి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చిన సైరా టీం చిరంజీవి బర్త్ డే సందర్భంగా సర్‌ ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 20 చిరంజీవి బర్త్ డే సందర్భంగా సైరా మూవీకి పవన్ ఇచ్చిన వాయిస్ ఓవర్‌ని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

సైరా టీజర్ కోసం పవన్ ఇచ్చిన వాయిస్ ఓవర్‌ని విడుదల చేసి జనసేనాని ఫ్యాన్స్‌ని ఖుష్ చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్,జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, నయన తార, అనుష్క, తమన్నా వంటి అగ్ర సినీ నటులు నటించగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.