దర్శకుడిగా ఫెయిల్‌…రచయితగా సక్సెస్‌

360
adivi sesh

ఎవరు సక్సెస్‌ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు అడవి శేష్. ఉహించని పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు అడవి శేష్. తాను ఫ్లాప్ దర్శకుడినని…రచయితగా మాత్రం సక్సెస్ అయ్యానని చెప్పారు. తన దర్శకత్వంలో వచ్చిన కిస్ మూవీకి పోస్టర్‌లను అతికించే మైదా పిండి ఖర్చులు కూడా రాలేదన్నారు.

కానీ తాను కథలు అందించిన క్షణం, గూఢచారి సినిమాలు బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచాయని చెప్పారు. తాజాగా ఎవ‌రు సినిమా కథ అందించానని వెల్లడించారు. హారర్ సినిమాలంటే భయమని నటించడానికి కాదే చూడటానికి కూడా ఇష్టపడనని చెప్పుకొచ్చాడు.

క్షణం తరువాత నేను చేసిన థ్రిల్లర్ ఇదే. సో వరుసగా చేయలేదు. కథ నచ్చతే సేమ్ జోనర్ అన్నది పట్టించుకోను. వచ్చిన సినిమాలు చేస్తూ వెళ్తాను అని చెప్పారు. ప్రస్తుతం మహేష్ హీరోగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో కీ రోల్ పోషిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాహుల్ పాకాల దర్శకత్వంలో గూఢచారి 2 చేయనున్నాడు. గూఢచారికి సీక్వెల్ గా రానున్న ఈ సినిమా 2021లో విడుదల కానుంది.