స్పీడ్‌ పెంచిన కాటమరాయుడు..

145

పవన్‌ కల్యాణ్‌ గతంలో సినిమా తర్వత సినిమా చేసేవాడు. ఏడాదికి ఆచితూచి ఒక్క సినిమా తీయటం లాంటివి కనిపించేవి.మరి ఏడాదికి ఒక్కటి చొప్పున ఆయన సినిమాలు చేసిన ఫ్యాన్స్ పండగ చేసేసుకుంటారు..పవన్‌ సినిమాకు సినిమాకు మధ్య గ్యాప్ ఏడాదిన్నర దాటిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకిలా అంటే సినిమా పూర్తి అయి.. విడుదల తర్వాత.. కనీసం ఒకట్రెండు నెలలు రెస్ట్ ఇలా కొన్ని కారణాలతో అలస్యం అవుతుంటుంది. పవన్‌ సినిమా ఎంత లేట్‌ గా విడుదలైనా ఫ్యాన్స్‌ మాత్రం మహా ప్రసాదంలా ఫీలౌతారు.

Pawan Kalyan's next Film with Trivikram

ఈ మద్య కాలంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల విషయంలో కాస్త స్పీడ్‌ పెండినట్టు కనిపిస్తున్నాడు. 2019 ఎన్నికలకు దాదాపు ఆర్నెల్ల ముందు నాటికి రాజకీయాల్లోకి సీరియస్ గా దృష్టి పెట్టాలని భావిస్తున్న పవన్ కల్యాణ్..అందుకు తగ్గట్లు సిద్ధమయ్యేందుకు చకచకా సినిమాలు తీయాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. దీంతో.. రోటీన్ కు భిన్నంగా తన సినిమా విడుదల తర్వాత తీసుకునే గ్యాప్ ను పక్కన పెట్టేసి.. షూటింగ్ కి సిద్ధమైపోతున్నారు.

తాజాగా కాటమరాయుడుతో సక్సెస్‌ అందుకున్న పవన్‌ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయాల్సిన మూవీ షూటింగ్ కు డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాడట.అంతే కాదు.. రిలీజ్ ఎప్పుడన్నది కూడా డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. ఏప్రిల్ ఆరు నుంచి మొదలయ్యే ఈ చిత్ర షూటింగ్.. నాన్ స్టాప్ గా నాలుగు నెలల పాటు వర్క్ చేసేసి.. బతుకమ్మ పండగ నాటికి థియేటర్లలో సినిమా వేసేద్దామని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. అదేనిజమైతే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు అంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది. ఒకే ఏడాదిలో తమ అభిమాన హీరో సినిమాలు రెండు చూసే అవకాశం కలగటం వారిని పిచ్చ హ్యాపీకి గురి చేస్తుందనటంలో సందేహం లేదు. వెంటవెంటనే అగ్రహీరోల సినిమాలు స్టార్ట్ అవుతుంటే.. ఇండస్ట్రీ సైతం కళకళలాడటం ఖాయం. కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటించే ఈ చిత్రంలో.. పవన్ ఐటీ ఇంజనీర్ గా నటించనుండటం గమనార్హం.