‘నాకు ఇంకా కడుపు కాలేదు’..

161
Bipasha Basu opens up on her rumoured pregnancy

ఆ బాలీవుడ్‌ బ్యూటీ పై తెగ రూమర్లు పుట్టుకొస్తున్నాయి. అసలు అలాంటి వేవీ ఇంకా జరగలేదు మొర్రో అంటున్నా నమ్మరే..? అంటూ తెగ సర్థిచెప్పే ప్రయత్నం చేస్తోంది ఆ భామ. ఇంతకీ అలామొత్తుకుంటున్న ఆ బాలీవుడ్‌ బ్యూటీ ఎవరంటే..బిపాసా బసు అని తేలింది. ఈ అమ్మడికి కడుపయ్యిందంటూ.. సోషల్‌ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. అయితే  తాను తల్లి కాబోతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించింది బిపాసా. సోషల్‌ మీడియాలో ఈ వార్త వైరల్‌ కావడం పట్ల బిపాసా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
 Bipasha Basu opens up on her rumoured pregnancy
తాను గర్భవతిని అవ్వాలని చాలామందికి ఆత్రుతగా ఉందని తెలుస్తోందని,  అయితే వాళ్ల ఆశాభావం బాగానే ఉన్నా.. తనకు మాత్రం ఈ వార్తలు చికాకు కలిగిస్తోందని చెప్పింది. తాను గర్భం దాల్చాలని తొందరపడుతున్న వాళ్లను నిరాశ పరుస్తున్నందుకు సారీ అని కూడా చెప్పింది ఈ అమ్మడు.  అయితే ఈ భామకి ఇప్పుడే తల్లి అయ్యే ఇంట్రెస్ట్‌ లేదట. తాము పిల్లలను కనాలని ప్లాన్ చేసుకోవడం లేదని, ఒకవేళ  అలా అనుకుంటే..  అది చాలా సంతోషకరమైన విషయం కాబట్టి తమ శ్రేయోభిలాషులతో తప్పకుండా పంచుకుంటామని అంటోంది.
Bipasha Basu opens up on her rumoured pregnancy
ఇలా ప్రతిసారీ తాను గర్భవతిని అవుతున్నానంటూ వార్తలు రాయడం మాత్రం సరికాదని, తాను బాగా ముక్కుసూటిగా ఉండే మనిషిని కాబట్టి ఏమైనా ఉంటే చెప్పేస్తానని స్ట్రాంగ్‌గా చెప్పింది బిపాసా.

అంతే కాకుండా ఇక ఈ విషయమై మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని చెబుతూ అందరికీ ధన్యవాదాలు కూడా చెప్పేసింది. మొత్తానికి తనకు కడుపుకాలేదని నిరాశపడుతున్న అందరికీ త్వరలో.. ఆ వార్తను కూడా అభిమానులతో ఎప్పుడు పంచుకుంటుందో వేచి చూడాల్సిందే.