బాలీవుడ్‌ మూవీలో విజ‌య్ దేవ‌ర‌కొండ..

328
Vijay Devarakonda

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫైట‌ర్ సినిమాలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. పూరీ జ‌గ‌న్నాథ్‌ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా పూరీ కనెక్ట్స్, పూరీ టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై ఛార్మితో కలిసి నిర్మిస్తున్నాడు పూరీ. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. హిందీలో ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కనిర్మాత క‌ర‌ణ్ జోహార్ సమ‌ర్పిస్తున్నారు. ఇదిలావుంటే మరో వైపు విజయ్‌ బాలీవుడ్ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు సమాచారం. ప్ర‌ముఖ ద‌ర్శ‌కనిర్మాత సంజ‌య్ లీలా బ‌న్సాలీతో విజ‌య్ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు బాలీవుడ్ సమాచారం.

ఈ చిత్ర కథ కూడా దేశభక్తి నేపథ్యంలో ఉండబోతుంది. 2019లో బాలాకోట్ వైమానిక దాడులు (ఎయిర్ స్టై్క్స్) ఆధారంగా రానున్న ఈ చిత్రంలో ఐఎఏఫ్ వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్ద‌మాన్ పాత్ర‌లో విజ‌య్ క‌నిపించ‌నున్నాడ‌ట‌. కై పో చే, కేదార్ నాథ్ వంటి చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించిన అభిషేక్ క‌పూర్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. అన్నీ కుదిరి అభిషేక్ కపూర్, భన్సాలీ సినిమా వర్కవుట్ అయితే మాత్రం బాలీవుడ్‌లో కూడా విజయ్ దేరవకొండ రేంజ్ పెరిగిపోవడం ఖాయం.