బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ‘సాక్ష్యం’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే దిశగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ లోగా ఈ సినిమా ఆడియో వేడుకను జరపాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నెల 26 వ తేదీన హైదరాబాద్ లో ఈ వేడుకను జరపనున్నారు.
అయితే ఈ సినిమా ఆడియో వేడుకకు ఒక ప్రముఖ హీరోను గెస్ట్‌గా తీసుకురావడనికి సన్నాహాలు చేస్తున్నారట చిత్ర యూనిట్. ఆ హీరో ఎవరనేగా మీ సందేహం మరెవరో కాదండి మన గబ్బర్‌సింగ్, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్. ఇటీవలే పవన్ ఒకే రోజు నా పేరు సూర్య-నేల టికెట్టు సినిమాల ఈవెంట్స్ కు వచ్చిన అందరికి షాకిచ్చాడు. అంతకు ముందు రంగస్థలం సక్సెస్ మీట్ కు వెళ్ళినప్పుడు కూడా అందరు ఆశ్చర్యపోయారు.
తాజాగా ‘సాక్ష్యం’ ఆడియో వేడుకకు కూడా పవన్ హాజరయ్యే అవకాశాల గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ఈ వేడుకకి ప్రత్యేక అతిథిగా పవన్ కల్యాణ్ ను ఆహ్వానించారట చిత్ర యూనిట్. తప్పకుండగా వస్తానని పవన్ చెప్పినట్టుగా సమాచారం.