ఏపీలో జనసేన రోజు రోజుకు బలం పెంచుకుంటూ ముదుకుసాగుతోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం జనసేన క్షేత్రస్థాయిలో విస్తరిస్తూ ప్రజలకు మరింత చేరువ అవుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం గట్టిగానే ఉండే అవకాశం ఉంది. ఇక అందుకు తగ్గట్టుగానే పవన్ కూడా వ్యూహరచన చేసుకుంటూ ముందుకుసాగుతున్నారు. అయితే పార్టీ ఎంత దూకుడుగా వ్యవహరిస్తున్నప్పటికి అ పార్టీని ప్రధానంగా ఒక సమస్య వెంటాడుతోంది. అదే పొత్తులపై ఎటు తేల్చుకోలేకపోవడం. వచ్చే ఎన్నికల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలనివ్వబోమని చెబుతున్నా పవన్.. పొత్తులకు సిద్దమే అనే స్పష్టమైన సంకేతాలను ఇచ్చారు.
అయితే ఏ పార్టీతో పొత్తు ఉండబోతుంది అనే దానిపై మాత్రం ఎటు తేల్చుకోలేకపోతున్నారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తు కొనసాగుతున్నప్పటికి.. బీజేపీ వల్ల జనసేనకు ఒరిగేదెమి లేదనేది జనసేన వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఇక టీడీపీతో పొత్తు పెట్టుకోవాలా ? లేదా అనే దానిపై కూడా పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాంతో జనసేన ఏ చేయబోతోంది అనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. అయితే ప్రశ్నలన్నిటికి కూడా ఈ నెల 14న సమాధానం చెప్పేందుకు పవన్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 14న మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించబోతున్నారు.
ఈ సభలో పొత్తులపై పవన్ పూర్తి క్లారిటీ ఇస్తారని పార్టీ ఇంచార్జ్ నాదెండ్ల మనోహర్ ఇదివరకే చెప్పుకొచ్చారు. అలాగే రాబోయే ఎన్నికల్లో జనసేన స్టాండ్ ఏంటి ? ఎలాంటి ప్రణాళికలతో జనసేన ముందుకు వెళ్లబోతుంది అనే దానిపై కూడా పవన్ క్లారిటీ ఇస్తారట. ఇక పవన్ చేపట్టే బస్సు యాత్ర కోసం జనసైనికులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ బస్సు యాత్రకు సంబంధించి కూడా 14న క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాంతో 14 వ తేదీ కోసం జనసేన వర్గం మాత్రమే కాకుండా టీడీపీ, వైసీపీ, బీజేపీ పార్టీలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే పవన్ చేసే ప్రకటనలు ఈ మూడు పార్టీలపై గట్టిగానే ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి పవన్ 14న ఎలాంటి సంచలన నిర్ణయాలు ప్రకటిస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి..