బాలయ్య షూటింగ్ డీటైల్స్

45
- Advertisement -

తాజాగా ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో సంక్రాంతి హిట్ కొట్టిన బాలయ్య నెక్స్ట్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమాకు సంబందించి చిన్న షెడ్యూల్ జరిగింది. తాజాగా తారకరత్న మరణం కారణం చేత షూటింగ్ వాయిదా పడింది. రేపటి నుండి మళ్ళీ షూటింగ్ మొదలు కాబోతుంది.

ఈ షెడ్యూల్ కోసం భారీ సెట్ వేశారు. హైదరాబాద్ లోనే షూటింగ్ జరగనుంది. బాలయ్య ఇందులో సరికొత్తగా కనిపించనున్నాడు. ముప్పై ఏళ్ల వయసులో గోడవల కారణం చేత జైలుకి వెళ్ళి శిక్ష అనుభవించి అరవై ఏళ్లకు బయటికి వచ్చే వ్యక్తిగా బాలయ్య కేరెక్టర్ ఉండబోతుందని అంటున్నారు.

ఈ సినిమాలో బాలయ్య సరసన ఫస్ట్ టైమ్ కాజల్ హీరోయిన్ గా నటించనుంది. శ్రీ లీల ఇందులో బాలయ్యకి కూతురుగా కనిపించనుందని తెలుస్తుంది. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజర్. సినిమాను దసరా కి రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -