ఉమెన్స్ డే…ఘనంగా గ్రీన్ ఛాలెంజ్

23
- Advertisement -

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎల్బీ నగర్ లోని అక్షర ఇంటర్ నేషనల్ స్కూల్ నందు పాఠశాల మహిళా ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినులు పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ జగన్ మోహన్ రావు ప్రిన్సిపల్,గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, కిషోర్ గౌడ్ , మహిళా నాయకురాలు సుశీల రెడ్డి, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్బంగా రాజ్యసభ సభ్యులు MP జోగినపల్లి సంతోష్ కుమార్ (JSR) పిలుపుమేరకు గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా మెుక్కను నాటి మహిళలందరికి మహిళాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు దూదిమెట్ల బాలరాజు.

మహిళా దినోత్సవం సందర్భంగా..అమెరికాలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహించారు. అమెరికాలోని టెక్సాస్ స్టేట్, ఆస్టిన్ లో వాళ్ళ కూతురు ఇంటి దగ్గర మొక్కలు నాటిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ చీప్ అడ్వైజర్ కె. మణిమాల మరియు అమెరికాలోని టెక్సాస్ స్టేట్ డల్లాస్ నగరంలో వాళ్ళ కూతురు ఇంటి దగ్గర మొక్కలు నాటిన ..ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి. అమెరికాలోని టెక్సాస్ స్టేట్, డల్లాస్ నగరంలో మొక్కలు నాటారు IVF అమెరికా డల్లాస్ సిటీ ప్రెసిడెంట్ శ్రీలత.

ఇవి కూడా చదవండి..

- Advertisement -