పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్ మూవీలో నటిస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని దిల్ రాజు, బోని కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఈమూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈసినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం 30రోజులు మాత్రమే కేటాయించాడు. అయితే ఈసినిమాతో పాటు మరో రెండు చిత్రాలకు సైన్ చేశాడు. క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభంకాగా…పవన్ కు గబ్బర్ సింగ్ లాంటి భారీ విజయాన్ని అందించిన హరీశ్ శంకర్ తో మరో సినిమా చేయనున్నారు.
ఈమూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ నిర్మించనుంది. త్వరలోనే ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. దర్శకుడు హరీశ్ శంకర్ ప్రస్తుతం స్క్రీప్ట్ వర్క్ పనిలో బిజీగా ఉన్నాడు. కాగా ఈమూవీలో హీరోయిన్ గా శృతి హాసన్ ను తీసుకొవాలని భావిస్తున్నారట. పవన్ కళ్యాణ్ శృతి హాసన్ లు కలిసి గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలో నటించారు. దీంతో ముచ్చటగా మూడోసారి వీరిద్దరు కలిసి నటించబోతున్నారు. ఈమూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.