గద్దెనెక్కిన సారలమ్మ..నేడు సమ్మక్క రాక

183
medaramjatara

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారక్క జాతర నిన్నటి నుంచి ప్రారంభం అయింది. పెద్ద ఎత్తున భక్తులు మేడారం కు చేరుకుని అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. నిన్న పగిడిద్ద రాజు గద్దెపైకి చేరుకున్నారు. కాగా ఇవాళ ఉదయం కన్నెపల్లి నుంచి సారలమ్మ మేడారం గద్దెకు చేరుకోనుంది. మరోవైపు పూనుగొండ్ల నుంచి పగిడిద్ద రాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలివచ్చి మేడారం గుడి వద్ద సారలమ్మకు స్వాగతం పలికారు.

MEDARAM

జాతర చివరి ఘట్టం కావడంతో మేడారం మొత్తం జనసంద్రంగా మారింది. సమ్మక్క తల్లి నేడు గద్దెలపైకి చేరుకోనుంది. చిలుకలగుట్టపై నుంచి సమ్మక్కను పూజారులు తీసుకురానున్నారు. సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య సమ్మక్క తల్లిని గద్దెలపై ప్రతిష్టించనున్నారు. కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కకు సంప్రదాయ పూజలు నిర్వహించనున్నారు. రేపు మేడారం సమ్మక్క సారక్కలను దర్శించుకోనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.