సీఎంఆర్‌ఎఫ్‌కు పవన్‌ కోటి విరాళం..

75
pawan

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, సినీ, వర్తక, వాణిజ్య ప్రముఖులు ముందుకు వస్తున్నారు.ఇప్పటికే పలువురు స్టార్లు ముందుకురాగా తాజాగా పవర్ స్టార్,జనసేనాని పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారు. తనవంతుగా కోటి రూపాయలు విరాళం అందిస్తున్నట్లు ప్రకటించిన పవన్‌….వరదలు, భారీ వర్షాలకు తీవ్రంగా నష్ట పోయిన హైదరాబాద్ ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు.

మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు,ప్రభాస్‌ తలో కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. వీరితో పాటు నాగార్జున రూ.50లక్షలు, జూనియర్‌ ఎన్‌టీఆర్‌ రూ.50లక్షల, విజయ్‌ దేవరకొండ రూ.10లక్షలు, దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఐదు లక్షల విరాళం ఇచ్చారు. మరికొంత మంది సినీ ప్రముఖులు సైతం ముందుకు వచ్చే అవకాశం ఉంది.