పవన్ – రానా…..’బిల్లా రంగా’

46
pawan

టాలీవుడ్‌లో మరో క్రేజీ మల్టీస్టారర్ రాబోతున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – రానా ప్రధాన పాత్రల్లో మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియమ్‌ తెలుగులో రీమేక్ అవుతుండగా సోమవారం పూజా కార్యక్రమాలు జరిగాయిజ

జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుండగా సాగ‌ర్ కె.చంద్ర డైరెక్ష‌న్ లో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతోంది. తమన్ సంగీతం అందిస్తుండగా తాజాగా సినిమా టైటిల్ ఖరారు అయినట్లు తెలుస్తోంది.

టీ టౌన్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం బిల్లా రంగా అనే టైటిల్ ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బిల్లాగా ప‌వ‌ర్‌స్టార్, రంగాగా రానా నటించనున్నారు.