మళ్లీ తెరపై కనిపించనున్న పవర్‌స్టార్‌..

216
- Advertisement -

టాలీవుడ్‌లో ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ అభిమానుల‌కి ఆయ‌న ఒక దేవుడు. కేవ‌లం 25 సినిమాలే చేసినా అభిమాన గ‌ణాన్ని మాత్రం ఎంతో సంపాదించుకున్నాడు. అయితే ప్ర‌జ‌ల‌కి సేవ చేయాల‌నే ఉద్ధేశంతో రాజకీయాల‌లోకి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు చేయ‌డం మానేశాడు. ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత వెండితెరకు దూరమైన పవన్‌ జనసేన పార్టీ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నాడు.

Pawan Kalyan

అయితే త‌మ అభిమాన న‌టుడిని వెండితెర‌పై చూడాల‌ని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మళ్లీ తెరపై కనిపించనున్నాడనే వార్త వైరల్‌గా మారింది. టాలీవుడ్‌లో ఇప్పుడ ఇదే హాట్‌ టాపిక్‌. పవన్ మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ తెరంగేట్రం చేయబోతున్న కొత్త సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించనున్నాడని సమాచారం.

అంతకుముందు పవన్ కళ్యాణ్‌తో ‘‘గోపాల గోపాల, కాటమరాయుడు’’ సినిమాలు చేసిన డైరెక్టర్ డాలీ(కిషోర్ కుమార్ పార్థసాని) దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా కొత్త సినిమా రూపొందనుంది. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌‌టైన్‌మెంట్స్ అధినేత రామ్‌ తళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే డైరెక్టర్ డాలీ, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న స్నేహం కారణంగా పవన్‌ని గెస్ట్ రోల్ చేయవలసిందిగా డాలీ కోరాడట. దీనిపై పవన్ కూడా సుముఖత వ్యక్తం చేశాడని సినీ జనాలు అంటున్నారు.

- Advertisement -