నన్ను దోచుకుందువటే.. ట్రైలర్

306
Nannu Dochukunduvate Movie
- Advertisement -

సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌లో ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘నన్ను దోచుకుందువటే’..నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆఫీస్ మొత్తం భయ‌ప‌డే సాఫ్ట్ వేర్ కంపెనీ మేనేజ‌ర్‌గా సుధీర్‌బాబు న‌టించ‌గా.. అల్ల‌రి చేసే గ‌డుస‌మ్మాయి సిరి పాత్ర‌లో హీరోయిన్ న‌భా న‌టేశ్ క‌నిపించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా రెడీ అవుతున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు శరవేగంగా జరుగుతున్నాయి.

Nannu Dochukunduvate Movie

ఈ సినిమా ట్రైలర్ ఈరోజే రిలీజ్ అయింది. రెండు నిమిషాల పదహారు సెకన్ల ట్రైలర్‌లో స్టార్ట్ నుండి ఎండ్ వరకూ కామెడీ పంచ్‌లు అదిరిపోయాయి. పని రాక్షసుడిగా స్ట్రిక్ట్‌గా ఉన్న బాస్‌గా కార్తిక్ (సుధీర్ బాబు) అందరినీ జడుసుకునేలా చేస్తుంటాడు. ఇక సగం ట్రైలర్ ఆఫీస్‌లో పని చేసే వాళ్ళ బాధలే కనిపిస్తాయి. ఇక ఇదివరకే విడుదలైన ఫస్ట్‌లుక్‌,టీజర్‌కు మంచి రెస్సాన్స్‌ రాగా తాజాగా విడుదలైన ట్రైలర్‌ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలావుంది. ఈ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి..!

- Advertisement -