లైఫ్ లో ప్రేమ ఓకేసారి పుడుతుందిః రేణుదేశాయ్

202
Renu-Desai

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ త్వ‌ర‌లో ఓ వ్య‌క్తిని వివాహం చేసుకోనున్న విష‌యం తెలిసిందే. ఇటివ‌లే ఎంగేజ్ మెంట్ కూడా అయిపోన‌ట్లు త‌న ట్వీట్ట‌ర్ లో పోస్ట్ చేసింది రేణూ. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రూ వివాహం కూడా చేస‌కోబోతున్న‌ట్లు చెప్పింది. ఈసంద‌ర్భంగా ప‌లువురు సెల‌బ్రెటీలు రేణు దేశాయ్ కి విషెష్ చెబుతున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాన్ కూడా రేణు దేశాయ్ కి త‌న ట్వీట్ట‌ర్ ద్వారా విషెస్ తెలిపాడు. ప‌వ‌న్ చేసిన ట్వీట్ కు ప‌లువురు సెల‌బ్రెటీలు, అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తోన్నారు.

renu deshai

ఈసంద‌ర్భంగా రేణు దేశాయ్ త‌ను చేసుకోబోయే పెళ్లి గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది. త‌ను ఇప్పుడు చేసుకోబోయేది ప్రేమ వివాహం కాద‌ని అత‌న్ని నేను ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డం లేద‌ని తెలిపింది. త‌న స‌న్నిహితులు ఈ వివాహ‌న్ని కుదిర్చార‌ని వివ‌రించారు. నా జీవితంలో ప్రేమ అనేది ఒక‌రిపైనే ఉంటుందంని..ఓకే సారి ప్రేమ‌లో ప‌డ‌టం జ‌రుగుతోంద‌న్నారు. గ‌త ఏడేళ్లుగా తాను ఓంట‌రిగానే జీవించాన‌ని చెప్పింది. ఇప్పుడు త‌న లైఫ్ లోకి కొంచెం సంతోషం వ‌చ్చింద‌న్నారు రేణు దేశాయ్.

renu deshai engagment

పెళ్లిపై త‌న‌కు ఏ మాత్రం ఆతృత లేద‌ని..లైఫ్ లో ఓంట‌రిగా ఉండ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌తోనే తాను పెళ్లి చేసుకుంటున్నాన‌ని తెలిపింది. ఇక నుంచి లైఫ్ లో సంతోషంగా ఉండాల‌నుకుంటున్నాన‌ని చెప్పారు. ఇక త‌న‌కు కాబోయే భ‌ర్త పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించింది. మ‌ళ్లి ఇంకొ అత‌నిని ప్రేమించి పెళ్లి చేసుకుని స‌హ‌జీవ‌నం చేయాల‌ని అనుకోవ‌ట్లేద‌ని తెలిపింది. అందుకోస‌మే సాంప్రాదాయ బ‌ద్దంగా పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పింది. ఇదంతా చూస్తుంటే త్వ‌ర‌లోనే పెళ్లి జ‌రుగ‌నున్న‌ట్లు తెలుస్తోంది.