ఫిఫాలో మరో కిస్ వివాదం.. వీడియో వైరల్..

229
Júlia_june26
- Advertisement -

రష్యా వేదికగా ఫిఫా వరల్డ్ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పోటీలను కవర్ చేసేందుకు వెళ్లిన వివిధ దేశాల మహిళా రిపోర్టర్లకు మాత్రం వేధింపులు కొనసాగుతున్నాయి. లైవ్ ఇస్తున్న మహిళా రిపోర్టర్లకు ఆకతాయిలు.. ముద్దులు ఇచ్చి వేధిస్తున్నారు. గతవారం జర్మనీకి చెందిన జూలియత్ అనే మహిళా రిపోర్టర్ కి.. ఓ గుర్తు తెలియని వ్యక్తి లైవ్ లో ముద్దు పెట్టిన వెళ్లిన విషయం  తెలిసిందే.FiFa World Cup

అది మరవకముందే.. తాజాగా అదే తరహాలో బ్రెజిల్ కి చెందిన మహిళా రిపోర్టర్ కి మరో ఆకతాయి ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు. కాని ఆకతాయి చేసిన పని బెడిసికొట్టింది.. ఆ రిపోర్టర్ తో చివాట్లు తిన్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్ టీవీ చానెల్ కి చెందిన జూలియా గుమారాస్ అనే మహిళా రిపోర్టర్ యోకాటెరిన్ నుంచి లైఫ్ కార్యక్రమం ఇస్తుంది. లైవ్ ఇస్తున్న సమయంలో ఆకతాయి.. సడెన్ గా వచ్చి ఆమెకు ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు. ఆకతాయిని గమనించిన జూలియా, ఆ వ్యక్తి నుంచి తప్పించుకుని అతనికి చివాట్లు పెట్టింది. ఓ మహిళతో ఈ విధంగా ప్రవర్తించడం పద్దతి కాదని చెప్పింది. మరో సారి ఇలా చేయవద్దని వార్నింగ్ ఇచ్చింది. దాంతో క్షమించాలంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ వ్యక్తి.

ఈ ఘటనపై ట్విట్టర్లో జూలియా స్పందిస్తూ.. తనకు ఇక్కడ ఇలా జరగడం రెండోసారి అని, దాని గురించి మాట్లాడడానికి మాటలు రావడం లేదని తెలిపింది. తన అదృష్టం బాగుండి తప్పించుకున్నానని చెప్పింది. రష్యాలో మహిళా రిపోర్టర్ లపై ఇలాంటి సంఘటనలు చాలానే జరుగుతున్నాయని అన్నారు.

- Advertisement -