Pawan:పవన్ ‘తూ తూ మంత్రం’!

37
- Advertisement -

తెలంగాణలో జనసేన పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట ఒంటరిగానే పోటీ చేయాలని పవన్ భావించినప్పటికీ బీజేపీ అగ్రనాయకత్వం కోరిక మేరకు పవన్ చేతులు కలిపారు. అయితే మొదట తెలంగాణ ఎన్నికలను కూడా సీరియస్ గా తీసుకున్న పవన్ టి.బీజేపీతో జట్టు కట్టిన తరువాత ఎన్నికలను లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణలో మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్నప్పటికి ఇంతవరకు పవన్ ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేపట్టలేదు. అబు బీజేపీ కూడా పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు. దీంతో అటు బీజేపీ గాని ఇటు జనసేన గాని ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలు తక్కువ అని ఆ పార్టీల అగ్రనేతలు అంచనా కు వచ్చారా అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి..

బీజేపీ తరపున అమిత్ షా, నడ్డా వంటి జాతీయ నేతలు ప్రచారాలు నిర్వహిస్తున్నప్పటికి కమలం పార్టీలో ఆశించినంత మైలేజ్ రావడం లేదు. అందుకే ఇక పవన్ ను కాకా పట్టడమే మంచిదని కమలనాథులు భావిస్తున్నారట. దీంతో ఎట్టకేలకు బీజేపీ నేతల కోరిక మేరకు తెలంగాణలో పవన్ ప్రచారానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇవాళ నుంచి ఆయా నియోజకవర్గాల్లో పవన్ ప్రచారాలు నిర్వహించేలా ప్లాన్ చేసుకున్నారట. అయితే బీజేపీ కోరిక మేరకు ఈ ప్రచారాలను తూ తూ మంత్రంగా నిర్వహించాలని పవన్ చూస్తున్నాట్లు టాక్. ఏపీలో మాదిరి ఘాటైన వ్యాఖ్యలతో పవన్ ప్రసంగాలు ఉండబోవని, ఏదో నామమాత్రంగానే ప్రచార కార్యక్రమాలు ఉంటాయని తెలుస్తోంది. బీజేపీ జనసేన కూటమిలో భాగంగా బీజేపీ 111 స్థానాల్లోనూ జనసేన 8 స్థానాల్లోనూ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి పవన్ నామమాత్రపు ప్రచారాలు బీజేపీకి ఎంతవరకు కలిసొస్తాయో చూడాలి.

Also Read:KCR:రోహిత్ రెడ్డితోనే తాండూరు అభివృద్ధి

- Advertisement -