Etela:ఈటల ‘మొసలి కన్నీరు’!

59
- Advertisement -

ఒకప్పుడు బి‌ఆర్‌ఎస్ ( టి‌ఆర్‌ఎస్ ) లో కీలక నేతగా వ్యవహరిస్తూ అధినేత కే‌సి‌ఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న ఈటెల రాజేందర్.. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు ప్రభుత్వంపై ఆయన వహించిన నిర్లక్ష్యం.. పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యేలా చేశాయి. ఆ తరువాత బీజేపీలో చేరిన ఈటెల.. తనకు రాజకీయ భిక్ష పెట్టిన బి‌ఆర్‌ఎస్ పై విషం చిమ్ముతు వచ్చారు. అయినప్పటికి ఒకప్పుడు బి‌ఆర్‌ఎస్ లో కీలక నేత అనే కారణంతో అటు అధినేత కే‌సి‌ఆర్ గాని, వర్కింగ్ ప్రసిండెంట్ కే‌టి‌ఆర్ గాని ఎంతో హుందాగా ఈటెలకు గౌరవం ఇస్తూ వచ్చారు. కానీ ఈటెల మాత్రం కే‌సి‌ఆర్ మరియు కే‌టి‌ఆర్ పై అగౌరవంగా చేసిన వ్యాఖ్యలు అనేకం.

ఇక ప్రస్తుతం ఎన్నికల వేళ మొసలి కన్నీరు కరుస్తూ అందరి దృష్టి తనపై ఉండేలా వ్యవహరిస్తున్నారు ఈటెల రాజేందర్. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ తో పాటు కే‌సి‌ఆర్ కు పోటీగా గజ్వేల్ నుంచి కూడా ఈటెల బరిలో దిగనున్నారు. హుజూరాబాద్ లో ప్రస్తుతం ఈటెల పై తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. నియోజకవర్గంలో ఈటెలకు ఈసారి ఓటమి తప్పదనే సంకేతాలను సర్వేలు కూడా తేల్చి చెబుతున్నాయి. అటు గజ్వేల్ లో కే‌సి‌ఆర్ కు పోటీ కావడంతో అక్కడ అసలు డిపాజిట్లు కూడా దక్కించుకునే అవకాశం లేదు. దాంతో తన రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందనేది చాలమంది రాజకీయ వాదులు చెబుతున్న మాట.

ఈ నేపథ్యంలో సెంటిమెంట్ కు తెర తీస్తూ.. తనకు బి‌ఆర్‌ఎస్ లో అన్యాయం జరిగిందని, కే‌సి‌ఆర్ అంటే తనకు ఎంతో అభిమానమని ఆయనతో గొడవ పడే రోజు వస్తుందనేదుకోలేదంటూ ఈటెల ఈ మద్య తన ప్రసంగాల్లో తరచూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు కే‌సి‌ఆర్ పై తీవ్రంగా మండిపడ్డ కే‌సి‌ఆర్ ఇప్పుడు సడన్ గా సెంటిమెంట్ ను రగిలించేలా బి‌ఆర్‌ఎస్ పార్టీనే తనకు గెంటేసిందని, లేకపోతే ఇప్పటికీ తాను బి‌ఆర్‌ఎస్ నేతనే అనేలా పరోక్ష వ్యాఖ్యలు చేస్తుండడంతో ఇవన్నీ కూడా ఈటెల ఓటమి భయంతోనే ముసలి కన్నీరు కారుస్తున్నారని రాజకీయ అతివాదులు చర్చించుకుంటున్నారు.

Also Read:KCR:రోహిత్ రెడ్డితోనే తాండూరు అభివృద్ధి

- Advertisement -