KCR:రోహిత్ రెడ్డితోనే తాండూరు అభివృద్ధి

52
- Advertisement -

రాష్ట్రంలోని మారుమూల పల్లెలకు, తండాలకు నీరు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్‌ది అన్నారు సీఎం కేసీఆర్. తాండూరులో బీఆర్ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్…దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్న రావల్సిన పరిణతి రాలేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి గుణగణాలతో పాటు అభ్యర్థి వెనకాల ఉండే పార్టీల చరిత్ర గమనించాలన్నారు. ఎవరు గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుందో ఆలోచించి ఓటు వేయాలన్నారు. ప్రజా స్వామ్యంలో ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటు అన్నారు.

బీఆర్ఎస్ చరిత్ర ప్రజలందరికి తెలుసు అన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే ప్రజల కోసం అన్నారు. 10 సంవత్సరాలుగా ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అన్నారు. 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో హరిగోస పడ్డామన్నారు. తాండూరు ప్రజలు తాగడానికి నీరు లేక అల్లాడిపోయిన పరిస్థితి గుర్తుండే ఉంటుందన్నారు. కాంగ్రెస్ పాలనలో వలసలు,తినడానికి తిండిలేక ఎంతో గోస పడ్డామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం ఒకవైపు అభివృద్ధి మరోవైపు జోడెడ్లలాగా పరుగులు పెట్టించామన్నారు.

కాంగ్రెస్ పాలనలో రూ.200 పెన్షన్ ఉంటే ఇవాళ రూ.2000 వేల పెన్షన్ ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని ఇళ్లు లేదన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతీ పథకం మీ కళ్ల ముందే ఉందన్నారు. రైతుల బాగు కోసం రైతు బంధు, రైతు భీమా,కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. దేశంలో రైతు బంధు పుట్టించిందే కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు రైతు బంధు దుబారా అని మాట్లాడుతున్నారని…రైతు బంధు ఉండాలంటే పైలట్ రోహిత్ రెడ్డి గెలవాలన్నారు. కాంగ్రెస్ తీసుకొస్తున్న భూమాత కాదు భూమేత అన్నారు. ధరణిని బంగాళాఖాతంలో కలిపేయాలన్న కాంగ్రెస్‌నే బంగాళాఖాతంలో కలిపేయాలన్నారు.రోహిత్ రెడ్డి చెప్పిన కోరికలన్ని నెరవేర్చే బాధ్యత తనదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చివేసే ప్రయత్నం చేస్తే నిజాయితీగా నిలబడ్డ గొప్ప వ్యక్తి అని అందుకే రోహిత్ డిమాండ్‌లన్ని నెరవేరుస్తానని తెలిపారు.

బంజారా బిడ్డలు మా తండాలో మారాజ్యం అని కొట్లాడితే ఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తాండూరులో 24 గ్రామ పంచాయతీల్లో గిరిజన బిడ్డలే సర్పంచ్‌లుగా ఉన్నారన్నారు. బంజారాల గౌరవానికి చిహ్నంగా బంజారా భవన్ కట్టామని చెప్పారు.

Also Read:Prabhas:సలార్‌కి అరుదైన రికార్డు ఖాయం

- Advertisement -