రాజకీయాలపై కీలక నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్….

273
pawan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో ఇటివలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. పవన్ పోటీ చేసిన రెండు నియోజవకర్గాల్లో ఓటమిపాలయ్యారు. జనసేన పార్టీ తరపున కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలవడం ఆ పార్టీని కలవర పెడుతుంది. దీంతో ఎన్నికల అనంతరం మళ్లీ సినిమాల్లోకి వస్తారని అంతా భావించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలతో బిజీ కాబోతున్నాడా? జనం కోసమే జనసేన అన్న తను ఎన్ని సార్లు, పొలిటికల్ గానే పోరాడతా నని అన్నా రూమర్స్ మాత్రం ఆగట్లేదు.

ఇటివలే దర్శకుడు హరీష్ శంకర్ వెళ్లి పవన్ కి కథ చెప్పాడంటూ వచ్చిన సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇక ఈవిషయం పవన్ దృష్టికి వెళ్లగా తాజాగా ఆయన స్పందించారు. తాను ఇక సినిమాలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇకపై తన జీవితం ప్రజాసేవకు అంకితం చేస్తానని తెలిపారు. అయితే ఇది వరకే ఈ విషయాన్ని స్పష్టం చేసినా ఎన్నికల అనంతరం అదే మాటను కుండబద్దలు కొట్టడంతో పవన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. రాబోయే 25 ఏండ్లు కేవలం ప్రజల కోసమే పనిచేస్తానని, సినిమాల్లోకి తిరిగి చూసే ప్రసక్తే లేదని పవన్ తేల్చి చెప్పారు.