మెగాస్టార్‌కు పవర్‌స్టార్‌ బర్త్‌డే విషెస్‌..

86

నేడు మెగా అభిమానులకు పండుగ రోజు. మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, కుటుంబ స‌భ్యులు, సెల‌బ్రిటీలు, శ్రేయోభిలాషులు చిరు బ‌ర్త్ డే సంద‌ర్భంగా శుభాకాంక్ష‌ల వెల్లువ కురిపిస్తున్నారు. అన్న‌య్య‌ని ఎంతో ప్రాణంగా ప్రేమించే ప‌వ‌న్ క‌ళ్యాణ్ సుదీర్ఘ‌ పోస్ట్ ద్వారా అన్న‌య్య‌పై త‌న‌కున్న ప్రేమని తెలియ‌జేస్తూ బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు.

చిరంజీవి తనకేకాదు.., ఎందరికో చిరంజీవి ఆదర్శమని పేర్కొన్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంకులతో ఎందరికో ఆదర్శంగా నిలిచారని పవన్ అన్నారు. తమ కుటుంబంలో అన్నగా పుట్టినా.. తండ్రిలా అందర్నీ సాకారన్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ప్రకటన విడుదల చేశారు.