దేశంలో కొత్తగా 30,948 కరోనా కేసులు నమోదు..

80
covid

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 30,948 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,24,24,234కు చేరింది. అలాగే గత 24 గంటల్లో క‌రోనా నుంచి 38,487 మంది కోలుకున్నారు. కొత్తగా 403 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మొత్తం 4,34,367 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,16,36,469 మంది కోలుకున్నారు. 3,53,398 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

అలాగే, దేశంలో గడిచిన 24 గంటల్లో 52,23,612 వ్యాక్సిన్ డోసులు వేయగా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 58,14,89,377 డోసుల వ్యాక్సిన్లు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు. మరోవైపు నిన్న ఒకే రోజు 15,85,681 కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. మొత్తం 50,62,56,239 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.