త‌మిళంలోకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీ..

939
Attarintiki-Daredi
- Advertisement -

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన అత్తారింటికి దారేది చిత్రం తెలుగులో భారీ విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. ఈసినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా..బివి ఎన్ ప్ర‌సాద్ నిర్మించారు. ప‌వ‌న్ క‌ళ్యాన్ లైఫ్ లోనే ఈమూవీ అతి పెద్ద హిట్ గా నిలిచింది. అంతేకాదు టాలీవుడ్ లో బాక్సాఫిస్ వ‌ద్ద ఎక్కువ క‌లెక్ష‌న్లు సాధించిన సినిమాల్లో నెం1 స్ధానంలో నిలిచింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న స‌మంత‌, ప్ర‌ణిత‌లు హీరోయిన్లుగా న‌టించారు.

attarintiki daredi

సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు అత్తారింటికి దారేది సినిమాను త‌మిళ్ లో రిమేక్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు త‌మిళ నిర్మాత‌లు. తెలుగులో భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్న ఈమూవీని త‌మిళ్ లో నిర్మిస్తే భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌వ‌చ్చు అనే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట త‌మిళ్ ఇండ‌స్ట్రీలోని ఓ నిర్మాత‌.

త‌మిళంలోని ప్ర‌ముఖ నిర్మాణ సంస్ధ అయిన లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈచిత్రాన్ని రీమేక్ చేయ‌డానికి సిద్ద‌మ‌య్యార‌ని స‌మాచారం. అందుకు ఈచిత్ర నిర్మాత బివియ‌న్ ప్ర‌సాద్ ద‌గ్గ‌ర నుంచి త‌మిళ రీమేక్ రైట్స్ ను కూడా కొనుగోలు చేశార‌ని తెలుస్తుంది. తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించగా.. త‌మిళ్ ఏ హీరో న‌టిస్తాడా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్ష‌కులు. త్వ‌ర‌లోనే ఈమూవీకి సంబంధించిన పూర్తి వివ‌రాలు ప్ర‌క‌టించ‌నున్నారు చిత్ర‌బృందం. తెలుగులో భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్న ఈమూవీ త‌మిళ్ లో ఏమేర‌కు విజ‌యం సాధిస్తుందో చూడాలిమ‌రి.

- Advertisement -