దిల్‌రాజుకు ఓకే చెప్పిన పవన్..!

434
pawan dil raju
- Advertisement -

కొన్ని రోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్‌కు రీఎంట్రీకి సంబంధించిన వార్తలు టీటౌన్‌లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి క్లారిటీ రాకపోయినా రూమర్స్‌ మాత్రం ఆగడం లేదు. తాజాగా పవన్‌కు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల మేర‌కు సినిమాల్లోకి ప‌వ‌న్ రీ ఎంట్రీ ఖాయంగా క‌న‌ప‌డుతుండగా తొలుత దిల్ రాజుతో సినిమా చేయడానికి పవన్ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. బాలీవుడ్‌ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్‌లో నటించనున్నారట పవన్.

ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనుండగా అమితాబ్ పోషించిన పాత్రను పవన్ పోషించనున్నారట. త‌ర్వ‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుందని టాక్‌.

- Advertisement -