నేనే కేఏ పాల్…ఆర్జీవీ సాంగ్ నవ్వు ఆపుకోలేరు..!

512
ka paul
- Advertisement -

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో ఏపీలో పొలిటికల్ హీట్ పెంచేశాడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌తో ప్రకంపనలు సృష్టించిన వర్మ ఈ ట్రైలర్‌లో చంద్రబాబు,పవన్,లోకేష్,కేఏ పాల్‌ని టార్గెట్ చేశాడు.

తాజాగా సినిమానుంచి పాటను విడుదల చేశారు. కేఏ పాల్‌ని టార్గెట్ చేస్తూ విడుదల చేసిన సాంగ్ నెటిజన్ల చేత నవ్వులు తెప్పిస్తోంది. నేనే కేఏ పాల్.. సూపిస్తా కమాల్.. నేనంటే మిలిటరీకి హడల్.. దేవుడికైనా గుండె గుభేల్ అంటూ ఎన్నికల సమయంలో పాల్ చేసిన ప్రసంగాల హైలైట్స్‌తో సాగిన పాట అందరిని ఆకట్టుకుంటోంది.

సిరాశ్రీ పాటను రాయగా అజయ్ మైసూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 22న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

- Advertisement -