పవన్ ఫ్యాన్ గా చిరు.. నిజమేనా?

20
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, మరియు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇద్దరు అన్నదమ్ముల్లే అయినప్పటికి క్రేజ్ విషయంలో వీరిద్దరి మద్య నువ్వా నేనా అనట్లుగా పోటీ వాతావరణం కనిపిస్తుంటుంది. అలాంటిది అలాంటిది ఈ ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో నటిస్తే.. ఆ ఉహే అభిమానులకు పూనకాలు తెపిస్తుంది. ఇక తాజాగా ఈ ఇద్దరి అన్నదమ్ములకు సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే.. మెగాస్టార్ నటిస్తున్న తాజా చిత్రం ” భోళా శంకర్ ” మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తమిళ్ లో అజిత్ నటించిన వేదాలం మూవీకి రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీని మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్లుగా ఎన్నో మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నారట డైరెక్టర్ మెహర్ రమేశ్. ఈ సినిమాలో మెగాస్టార్ లోని వింటేజ్ మాస్ అవతార్ ను మరోసారి తెరపై చూపించబోతున్నారట. మెగా అభిమానులను ఖుషీ చేసే మరో విషయం ఏమిటంటే చిరు ఈ మూవీ లో పవన్ అభిమానిగా కనిపిస్తాడని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అంతే కాకుండా ఖుషీ మూవీలోని నడుము సీన్ కూడా ” బోళా శంకర్ ” లో మెగాస్టార్ తో రీ క్రియేట్ చేయబోతున్నట్లు వినికిడి. ఇదే గనుక నిజం అయితే అభిమానులకు పూనకాలే అని చెప్పవచ్చు. ఇక ఈ మూవీని ఈ ఏడాది సమ్మర్ లో గాని లేదా దసరా సీజన్ లో గాని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా తమన్నా నాటిస్తుండగా కీర్తి సురేష్ చిరుకి చెల్లిగా నటిస్తుంది. అలాగే యాంకర్ రశ్మి ఐటం సాంగ్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ ఏడాది వాల్తేరు వీరయ్య మూవీతో సూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్.. భోళా శంకర్ మూవీతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

ఇవి కూడా చదవండి…

పిక్ టాక్ : కృతి కర్బంద అందాల వెల్లువ!

మార్చి 6న…రావణాసుర టీజర్‌

‘దసరా’ లో హైలెట్స్ ఇవే !

- Advertisement -