‘దసరా’ లో హైలెట్స్ ఇవే !

47
Nani Dasara
- Advertisement -

నాని హీరోగా తెర‌కెక్కుతున్న తాజా చిత్రం ద‌స‌రా. శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌తున్న ఈ సినిమా మార్చి 31న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ద‌స‌రాలో ఓ భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ ఉంద‌ని, సినిమా మొత్తానికి అదే హైలైట్ గా నిలుస్తుంద‌ని టాక్. మొత్తానికి ఈ వార్త‌ ద‌స‌రా సినిమా పై హైప్‌ను పెంచేస్తుంది.

దీనికితోడు తన పాత్రకు నాని ప్రాణం పోశారు. మునుపెన్నడూ చూడని విధంగా రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో హీరో నాని అద్భుతంగా నటించాడు. నిజంగానే పక్కా పెల్లెటూరి కుర్రాడిగా నాని చాలా సహజంగా కనిపించాడు. మరి భారీ అంచనాలతో రాబోతున్న దసరా ఆ అంచనాలకు తగ్గట్టుగానే.. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా గ్రాండ్ విజువల్స్ తో రాబోతుంది.

మెయిన్ గా దసరా కథలోని మెయిన్ ఎమోషన్స్, నాని పాత్రలోని షేడ్స్, అలాగే పల్లెటూరి నేపథ్యాన్ని.. ఆ నేపథ్యంలోని మెయిన్ యాక్షన్ సీక్వెన్సెస్ ను.. ఇలా సినిమాలో చాలా అంశాలు చాలా బాగుంటాయట. ఇప్పటికే ఈ సినిమా టీజ‌ర్‌ మంచి హైప్ సంపాదించుకుంది. పైగా ఇది నాని కెరీర్లో వ‌స్తున్న మొద‌టి పాన్ ఇండియ‌న్ చిత్రం కావ‌డంతో ప్ర‌మోష‌న్స్‌ని దృష్టిలో ఉంచుకుని ఒక సాంగ్‌ని చెన్నైలో రిలీజ్ చేయ‌డానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -