పవన్ నెత్తిన మరొకటి.. పరిస్థితి ఏమిటి ?

27
- Advertisement -

హీరో అక్షయ్‌కుమార్‌ నటిస్తున్న ప్రస్తుతం సినిమా ‘ఓ మై గాడ్‌-2’. ఈ మూవీకి అమిత్‌ రాయ్‌ దర్శకత్వం వహిస్తుండగా.. ఈ నెల 11న థియేటర్లో సందడి చేయనుంది. ‘ఓ మైగాడ్‌’లో అక్షయ్‌ కుమార్‌ కృష్ణుడి పాత్రను పోషించగా…సీక్వెల్‌లో శివుడి పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డ్‌ 27 కట్స్‌ విధించింది. ఇందులో శివుడి పాత్రను మెసేంజర్‌ ఆఫ్‌ గాడ్‌గా మార్చాలని సెన్సార్‌ బోర్డ్‌ ఆదేశించింది. దాంతో మేకర్స్ కొన్ని మార్పులు చేయక తప్పడం లేదు. మరోవైపు ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచేసింది. 2014లో విడుదలై ఓ మై గాడ్‌కు సీక్వెల్‌గా దర్శకుడు అమిత్‌రాయ్ ఈ చిత్రాన్ని అంతే అద్భుతంగా తెరకెక్కించాడని.. ఈ ట్రైలర్ ను చూస్తే అర్ధం అవుతుంది. ఈ సినిమాలో పంకజ్‌ త్రిపాఠి భక్తుడిగా, యామి గౌతమ్ లాయర్‌గా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక అక్షయ్ కుమార్ పాత్ర కూడా పవర్ ఫుల్ గా ఉంది. మొత్తానికి ఈ ట్రైలర్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చినట్టు అయ్యింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాని పవన్ కల్యాణ్ రీమేక్ చేయబోతున్నాడు అని రూమర్స్ వచ్చాయి. కాకపోతే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక అప్ డేట్ లేదు.

కానీ, ఈ సినిమా క్రియేట్ చేసిన బజ్ చూశాక, ఈ సినిమా చేస్తే బాగుంటుందని దర్శకుడు త్రివిక్రమ్ ఫీల్ అవుతున్నాడు. సో.. త్రివిక్రమ్ సినిమాని ఓకే చేస్తే.. ఆల్ మోస్ట్ పవన్ కళ్యాణ్ కూడా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఉంది. పవన్ ఇప్పటికే మొదలు పెట్టి మధ్యలో ఆపేసిన సినిమాలు ఉన్నాయి. అటు క్రిష్ – హరీష్ శంకర్.. పవన్ డేట్స్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో త్రివిక్రమ్ పవన్ నెత్తిన మరో సినిమా పెడితే.. పరిస్థితి ఏమిటి అనేదే డౌట్.

Also Read:Rangabali:ఓటీటీలోకి వచ్చేసింది

- Advertisement -