గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ ఇటీవల మహారాష్ట్రలోని తిప్పెశ్వర్ వైల్డ్‌లైఫ్ శాంక్చురీలో పర్యటించారు. దీనికి సంబంధించిన విశేషాలను మహారాష్ట్ర అటవీ అధికారులు మ్యాజికల్ మెల్ఘాట్ ట్విటర్ పేజీలో పోస్టుతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్ తీసిన జంతువులు పక్షల ఫోటోలను కూడా అందులో జతచేశారు. తిప్పేశ్వర్ అడవుల అందాలను విభిన్న జంతు సంపదను తన కెమెరా ద్వారా బంధించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు మహారాష్ట్ర అటవీ శాఖ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెల్ఘాట్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ జయోతి బెనర్జీ తిప్పేశ్వర్ డీఎఫ్‌ఓ కిరణ్ జగ్తప్‌తో మర్యాదపూర్వకంగా ఎంపీ సంతోష్ కుమార్‌తో భేటీ అయ్యారు.
Also Read: ODF:రక్షణ మంత్రికి లేఖ రాసిన హరీశ్‌రావు
ఈ సందర్భంగా ఎంపీతో అధికారులు మాట్లాడుతూ…మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల వెంట అటవీ రక్షణ, పులుల సంచారంపై వివరించారు. అడవులు, పర్యావరణ రక్షణకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని, గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా దేశవ్యాప్తంగా చేపట్టిన స్ఫూర్తివంతమైన పనులను ఈ సందర్భంగా మహారాష్ట్ర అధికారులకు ఎంపీ వివరించారు.
Also Read: రోజుల్లో 12గంటల పనివేళలు.. ఎక్కడంటే!
ఈ సందర్భంగా ఎంపీ రీట్విట్ చేస్తూ ఈ సందర్భంగా అందమైన అడవులు, వన్యప్రాణులను చూసేందుకు త్వరలోనే మరోసారి పర్యటించేందుకు ప్రయత్నిస్తానని ఎంపీ అన్నారు.
Thank you so very much @jayotibanerjee ji and @KiranJagtap123 ji . You are such an amazing host. Thank you for all the help. Would certainly look forward to see you and the beautiful wildlife again soon 👍. https://t.co/jBqcEy6lAN
— Santosh Kumar J (@SantoshKumarBRS) April 22, 2023