హార్దిక్ పాండ్యా రికార్డు.. ఇండియా 487 ఆలౌట్

211
Pandya slams 86-ball ton as India push towards 500
Pandya slams 86-ball ton as India push towards 500
- Advertisement -

శ్రీలంక-భారత్ మధ్య జరుగుతున్న చివరి టెస్టు రెండో రోజు మ్యాచ్ లో శ్రీలంక‌ బౌలర్లకు చుక్క‌లు చూపించాడు ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా. లంక బౌల‌ర్ల‌ను చీల్చి చెండాడిన పాండ్యా.. కేవ‌లం 86 బంతుల్లో టెస్టుల్లో తొలి సెంచ‌రీ చేశాడు. అత‌ని ఇన్నింగ్స్‌లో 7 సిక్స్‌లు, 8 ఫోర్లు ఉన్నాయి. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగ‌డంతో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లోనూ టీమిండియా భారీ స్కోరు సాధించింది. రెండో రోజు లంచ్ స‌మ‌యానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 487 ప‌రుగులకు ఆలౌట్‌ అయింది.

అంతకుముందు 50 పరుగులు పూర్తి చేయడానికి పాండ్యా61 బంతులు ఆడాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అనంతరం చెలరేగి పోయిన పాండ్యా, స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో యాభై పరుగులను కేవలం 25 బంతుల్లోనే పాండ్యా పూర్తి చేసి శతకం కొట్టాడు. ఈ సిరీస్ ద్వారానే టెస్టుల్లో అరంగేట్రం చేసిన హార్దిక్.. ఆడుతున్న మూడో టెస్టులోనే సెంచరీ సాధించడం మరో విశేషం. మరొకవైపు ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి వేగవంతమైన సెంచరీ సాధించిన భారత ఆటగాడిగా హార్దిక్(108) నిలిచాడు.  ఓపెన‌ర్లు ధావ‌న్ (119), లోకేష్ రాహుల్ (85) రాణించారు. ఆ త‌ర్వాత పాండ్యా త‌ప్ప మిడిలార్డ‌ర్‌లో ఎవ‌రూ క‌నీసం హాఫ్ సెంచ‌రీ కూడా చేయ‌లేదు.

- Advertisement -