ఇంటర్‌లో ఉత్తీర్ణులైన అవిభక్త కవలలు వీణ-వాణి

41
Veena and Vani
- Advertisement -

నేడు విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అవిభక్త కవలలైన వీణ-వాణి లు ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫలితాల్లో వీణ 712 సాధించగా.. వాణి – 707 మార్కులు తెచ్చుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన,స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ వీణ-వాణీలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు. వారి భవిష్యత్తుకు అవసరమైన అన్నిసదుపాయాలను అలాగే వారి కలలను సాకారం చేసుకోవడానికి ఈ ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలియజేశారు. వీణ-వాణి లకు సహహారం అందిచిన అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు మంత్రి.

- Advertisement -