నాగర్‌ కర్నూల్‌లో పి.రాములు గెలుపు

195
trs car

నాగర్‌ కర్నూల్‌ టీఆర్ఎస్ అభ్యర్థి పి రాములు విజయబావుటా ఎగురవేశారు. లక్షా ఎనబై రెండు వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. ప్రతి రౌండ్‌లోనూ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ వచ్చిన టీఆర్ఎస్… రౌండ్ రౌండ్‌కి మెజార్టీని పెంచుకుంటూ పోయింది.

ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్ధి నామా నాగేశ్వరరావు గెలుపుబాటలో పయనిస్తున్నారు. ఆయన తన ప్రత్యర్ధి,కాంగ్రెస్ నేత రేణుకా చౌదరిపై స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ప్రస్తుతం లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో ఉన్నారు.

మెదక్‌లో హరీష్‌ రావు మరోసారి తనపట్టు నిరూపించుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డి 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వరంగల్,మహబూబాబాద్‌లోనూ టీఆర్ఎస్ భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది.