ఎంపీ కొత్త ప్రభాకర్‌కు హరీష్‌రావు శుభాకాంక్షలు..

211
T Harish Rao

తెలంగాణ రాష్ట్రంలో తొలి ఎంపీ ఫలితం విడుదలైంది. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి గాలి అనిల్ కుమార్ పై 3లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందాడు. మొత్తం పోలైన ఓట్లలో కొత్త ప్రభాకర్‌రెడ్డికి 572321 ఓట్లు రాగా, గాలి అనిల్ కుమార్ కు 263428 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 192048 ఓట్లు పోలయ్యాయి. కాగా ఈ విజయంపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.