కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నేనంటే భయమని తెలిపారు ఎంపీ అసుద్దీన్ ఓవైసీ. అదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఎంఐఎం బహిరంగ సభలో మాట్లాడిన ఓవైసీ… కొత్త సెక్రెటేరియట్ ఒవైసీ ఆనందం కోసమే అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నా ఆనందం కేవలం మసీద్‌లోనే ఉందన్నారు. గుజరాత్‌లోని ఓ హనుమాన్ మందిరం నమూనా ఆధారంగానే తెలంగాణ కొత్త సెక్రెటేరియట్ నిర్మించారని చెప్పారు.
మా అండదండలు ఉంటేనే ఎవరైనా ముఖ్యమంత్రి కాగలరు.. గుర్తుంచుకోండి. రాబోయే ఎన్నికల్లో మజ్లిస్ ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయనుందో త్వరలో వెల్లడిస్తాం అన్నారు. తెలంగాణలో ఆలయాలకోసం 2500 కోట్ల నిధులు ఖర్చు చేశారు. ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులకు హిందూ దేవతల పేర్లు పెట్టారు. రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో రామ మందిరాలు నిర్మిస్తామన్నాడని ఒవైసీ గుర్తుచేశారు.
Also Read:ఆమిర్ మూడో పెళ్లి..రాఖీ కామెంట్స్..!
మజ్లిస్ పేరు పేరు చెప్పుకొని తెలంగాణలో బీజేపీ పబ్బం గడుపుకోవాలనుకుంటే నాకు అభ్యంతరంలేదు. అయితే, అమిత్ షాకు తెలుసు ఒవైసీ ఇస్లాం ధార్మికుల సేవకుడని.. అందుకే ఆయనకు నేనంటే భయం అన్నారు. కొత్త లోక్‌సభలో ప్రధాని వెంట హిందూ పూజారులే ఉన్నారు. ముస్లీం, క్రైస్తవ, సిఖ్ ధర్మ ప్రముఖులను ఎందుకు పిలవలేదు అని ఒవైసీ ప్రశ్నించారు. కొత్త లోక్‌సభ ప్రారంభోత్సవంలో ప్రజాస్వామ్యం ప్రతిబింబించలేదు.. రాజరిక రాజ్యాభిషేకం ప్రతిబింబించిందని విమర్శించారు.
Also Read:IMD:రాగల ఐదు రోజులు తెలంగాణలో వర్షాలు