తెలుగు మూవీ ‘RRR’ మూవీ ఆస్కార్ బరిలో నిలవడంపై తెలుగు సినిమా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నా.. లోపల మాత్రం విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ లోని ‘నాటు నాటు’ పాటకు ఇటీవలే ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది, ఇప్పుడు అదే పాటకు ఆస్కార్ బరిలో కూడా చోటు దక్కింది. ఐతే, ఈ పాట కాకుండా ఉత్తమ నటుడు కేటగిరీలో ఆర్ఆర్ఆర్ పోటీ పడి ఉంటే బాగుండేది అని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.
ఈ క్రమంలోనే ‘RRR’ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ పాట పరంగా మాత్రమే నామినేషన్ ని దక్కించుకోవడం పలువురిని షాక్ కు గురిచేస్తోంది. ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం విభాగాల్లో ‘RRR’ పోటీపడలేకపోవడానికి కారణం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మన దేశం తరఫున ‘RRR’ని ఆస్కార్ కు పంపించకపోవడమే అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారికంగా ‘RRR’ ని ఆస్కార్ కు నామినేట్ చేసుంటే అవార్డు దక్కేదేమో.
ఒక్కటి మాత్రం ఇక్కడ చెప్పాలి. ఉత్తమ నటుడు కేటగిరీ కింద ఎన్టీఆర్ నామినేట్ అవ్వకపోవడం తెలుగు ప్రేక్షకులతో పాటు హిందీ ప్రేక్షకులను కూడా బాధ పెట్టింది. అంత గొప్పగా ఎన్టీఆర్ నటన అందరికీ కనెక్ట్ అయ్యింది. కానీ ఆస్కార్ మాత్రం ఎన్టీఆర్ కి ఆస్కారం లేకుండా పోయింది.
ఇవి కూడా చదవండి…