మూడో పెళ్ళికి కారణం అప్పులే

120
- Advertisement -

సీనియర్ హీరోయిన్ జయసుధ మూడో పెళ్లి చేసుకుందని అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, ఆ పెళ్ళికి కారణం ఆర్థిక ఇబ్బందులు అని తెలుస్తోంది. ప్రస్తుతం జయసుధ గారి పరిస్థితి చూస్తే అవకాశాలు తక్కువ, అప్పులు ఎక్కువగా ఉంది. ఐతే క్యారెక్టర్ నటిగా కూడా ఆమెకు మంచి పేరు ఉంది. అయినా జయసుధ గారి ఆర్థిక పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఆమె నిర్మాతగా అప్పట్లో కొన్ని సినిమాలు చేసింది. అప్పుడు ఆస్తులు పోగొట్టుకుంది. ఆ తర్వాత నటిగా కూడా క్యాష్ చేసుకోలేకపోయారు.

ప్రస్తుతం జయసుధ గారు కష్టకాలంలో ఉన్నారు. సుమారు పదిహేను కోట్లకు పైగా ఆమెకు అప్పులు వున్నాయట. ఆ అప్పులకు కారణం జయసుధ కుమారులు చేసిన సైడ్ బిజినెస్ అని తెలుస్తోంది. అయితే, సినిమా వాళ్ళ అప్పులకు వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. జయసుధకి వడ్డీలు పెరిగి పెరిగి ఏడాదికి కోటి రూపాయల వరకు వడ్డీనే కడుతుందట. అందుకే చకచకా సినిమాలు చేయడానికి ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు.

ఐతే, జయసుధ గారు ముందుకు వస్తోన్నా.. ఛాన్స్ లు ఇచ్చేవారు కరువయ్యారు. దాంతో, ఆ మధ్య అమెరికా వెళ్ళింది. అక్కడ ఏదైనా బిజినెస్ పెట్టి సక్సెస్ అయిపోవాలని. కానీ.. అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. మొత్తానికి జయసుధకు ఇప్పుడు అప్పులు ఎక్కువైపోయాయి. మరి ఇప్పుడు ఏమి చేస్తోందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

ఎమర్జెన్సీ నుంచి క్రేజీ ఆప్‌డేట్‌

బాలయ్య ‘సారీ ‘ చెప్తారా ?

ఆస్కార్‌ బరిలోని చిత్రాలివే !

- Advertisement -