వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం కోసం బిఆర్‌ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. ప్రజా మద్దతు కూడా మెండుగా ఉండడంతో బిఆర్‌ఎస్ కు విజయం ఖాయమనే వాదన వినిపిస్తోంది. అయితే ఈసారి 100కు పైగా సీట్లు కైవసం చేసుకోవాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు కేసిఆర్. మరి ఆ టార్గెట్ రీచ్ కావాలంటే వ్యూహాత్మకంగా అడుగులేయ్యాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ప్రతిపక్ష నేతలు పోటీ చేసే స్థానాలపై కేసిఆర్ గురి పెట్టినట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, అలాగే బిజెపి చీఫ్ బండి సంజయ్.. మరియు మరికొంత మంది ప్రత్యర్థి నేతలు పోటీ చేసే నియోజిక వర్గాలలో జెండా పాతితే రేస్ లో ప్రతిపక్షాలు బలహీన పడతాయనేది కేసిఆర్ వ్యూహంగా విశ్లేషకులు చెబుతున్నారు.
రేవంత్ రెడ్డి కోడంగల్ నుంచి బరిలోకి దిగబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇక్కడ ఆయన గత ఎన్నికల్లో ఓటమిపాలు అయినప్పటికి మళ్ళీ ఇదే నియోజిక వర్గాన్ని ఎంచుకున్నారు రేవంత్ రెడ్డి. ఈసారి కూడా రేవంత్ రెడ్డికి ఈ నియోజిక వర్గంలో షాక్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడే అవకాశం ఉంది. అందువల్ల రేవంత్ రెడ్డిని ఢీ కొట్టే బలమైన నేతను బరిలో దించాలని చూస్తున్నారు కేసిఆర్. ఇక బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ లేదా వేములవాడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.
Also Read: KTR:రాష్ట్రంలో చెరువుల పండుగ
ఎక్కడ పోటీ చేసిన బండిని ఓడించడమే లక్ష్యంగా బిఆర్‌ఎస్ అభ్యర్థిని కేసిఆర్ బరిలో దించనున్నారు. అలాగే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి తరుపున ఈటెల గెలిచారు. దాంతో ఈసారి హుజూరాబాద్ లో ఈటెలకు చెక్ పెట్టాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు కేసిఆర్. ఇప్పటికే నియోజిక వర్గ బాధ్యతలను పాడి కౌశిక్ కు అప్పగించారు. ఆయనే దాదాపుగా బరిలోకి దిగే అవకాశం లేకపోలేదు. ఇక అలాగే బిఆర్‌ఎస్ పై తరచూ విమర్శలు గుప్పించే ఎంపీ అర్వింద్ పోటీ చేసే స్థానంపై బిఆర్‌ఎస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇలా ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీలలోని బలమైన నేతలు పోటీ చేసే స్థానాలపై కేసిఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టిన్నట్లు తెలుస్తోంది. మరి ప్రత్యర్థులపై కేసిఆర్ ఎంతమేర పైచేయి సాధిస్తారో చూడాలి.
Also Read: వన్ టూ వన్ ఫార్ములా.. సాధ్యమేనా.!?