రెండు గంటలకు మించి ఫోన్ వాడితే.. ప్రమాదమా !

22
- Advertisement -

నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. పెద్దల నుంచి పిల్లల వరకు ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. లేదంటే రోజు గడవని పరిస్థితి. బ్యాంకింగ్ లావాదేవీలు జరపాలన్న, ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్న స్మార్ట్ ఫోన్ వైపే చూస్తాము. ఇక కాస్త సమయం దొరికిన గంటల తరబడి పోన్ చూస్తూ టైమ్ పాస్ చేస్తుంటాము. మరి ముఖ్యంగా చిన్న పిల్లలైతే మొబైల్ గేమ్స్ కు బానిసలుగా మారుతున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

రోజుకు 24 గంటలు ఫోన్ లో గడిపేస్తున్నా వారు ఎందరో. అయితే స్మార్ట్ ఫోన్ ను రెండు గంటలకు మించి ఎక్కువగా యూజ్‌ చేస్తే నష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ఎక్కువగా యూజ్ చేస్తే నాడీ సంబంధిత సమస్యలు తలెత్తుతాయట. ఎందుకంటే ఫోన్ యొక్క రేడియేషన్ నాడీ వ్యవస్థపైనే ఎక్కువగా పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక ఫోన్ యొక్క బ్లూ లైట్ కళ్లపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. తద్వారా కంటిచూపు మందగించడంతో పాటు వివిధ రకాల కంటి సమస్యలకు కారణం అవుతుంది. ఇంకా మెదడు పని తీరును కూడా మందగిస్తుంది.

Also Read: స్కిన్ అలర్జీ సమస్యలకు చక్కటి చిట్కా!

చాలా మంది తలవొంచి మొబైల్ ను తదేకంగా చూడడం వల్ల మెడ నరాలపై ఒత్తిడి పెరిగి మెడనొప్పికి దారి తీస్తుంది. మొబైల్ లోని గేమ్స్ ఎక్కువగా ఆడడం వల్ల హైపర్ టెన్షన్ కు లోనై మూర్ఛరోగానికి దారి తీసే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు గంటల తరబడి మొబైల్ చూడడం వల్ల ఒంటరితనానికి అలవాటు అవుతారు. తద్వారా పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. ఇంకా పిల్లల్లో యాక్టిన్ నెస్ తగ్గుతుంది. ఇలా ఎన్నో అనార్ధాలు పొంచి ఉన్నాయి. కాబట్టి రెండు గంటలకు మించి ఫోన్ వాడకూడదని నిపుణులు చెబుతున్నారు.

Also Read: కలబంద మన అనుబంధం…

- Advertisement -