టిటిడి నిర్వహించిన శుద్ధ తిరుమల, సుందర తిరుమల కార్యక్రమంలో పాల్గోనే అవకాశం లభించిందని సుప్రీం కోర్టు మాజీ సీజేఐ ఎన్వీ రమణ.ఇది దేవుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నా అన్నరు.తిరుమల కొండలను మనం ఎంతో పవిత్రంగా చూసుకుంటాం…అనేక మంది దేవతలకు నిలయంగా తిరుమల కొండను భావిస్తాం అన్నారు.
తిరుమల కొండను పవిత్రం చూసుకోవాల్సిన భాధ్యత ప్రతి ఒక్క భక్తుడిపై ఉందన్నారు.శ్రీవారి దర్శనంకు విచ్చేసే భక్తుడు ,ప్లాస్టిక్ వ్యర్ధాలు,ఇతర వ్యర్ధాలను గానీ నిర్ధేశించిన ప్రదేశంలో పారవేయాలన్నారు.దీంతో ఆహ్లాదకరమైన వాతావరణం, పర్యావరణ పరిరక్షణ కలుగుతుందన్నారు. ప్రతి భక్తుడు పవిత్రతో శ్రీనివాసుడి దర్శనం చేసుకున్నాం అనే అనుభూతి కలుగుతుందన్నారు.
Also Read:కౌంటింగ్ నేడే.. ఫలితాలపై ఉత్కంఠ !
ప్రతి ఒక్కరి చేతులు ఎత్తి నమస్కరించి ప్రార్ధిస్తున్నా..తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వ్యర్ధాలను ఎక్కడ బడితే అక్కడ పారవేయద్దు అన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నా అన్నారు.
Also Read:డిగ్రీ పట్టా అందుకున్నహరీశ్ తనయుడు..