ఎన్టీఆర్ భావోద్వేగం..!

443
ntr
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పలువురు హీరో, హీరోయిన్లతో పాటు ఫ్యాన్స్‌ సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెప్పారు. లాక్ డౌన్ నేపథ్యంలో పుట్టినరోజు వేడుకలు జరపవద్దని ఎన్టీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్‌ తమ అభిమాన నటుడికి స్పెషల్ విషెస్ చెప్పారు.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. మీరు చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది..మీరే నా బలం…చివరిదాకా తోడుగా ఉండటం తప్ప ఏం చేయగలనని పేర్కొన్నారు.అలాగే తనకు శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులందరికీ ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

నా సహచర నటీనటులకు, శ్రేయోభిలాషులకు, గుండె లోతుల్లో నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ ట్వీట్లు చదువుతుంటే చాలా గొప్పగా అనిపించిందని వరుస ట్వీట్లలో పేర్కొన్నారు ఎన్టీఆర్.

- Advertisement -