NTR31 నుండి అదిరిపోయే అప్‌డేట్‌..

83
ntr
- Advertisement -

ఈరోజు టాలీవుడ్ యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అభిమానుల‌కు డ‌బుల్ ట్రీట్ ఇచ్చారు. నిన్న ఎన్టీఆర్ 30కి చిత్రానికి సంబంధించిన స్పెషల్ గ్లింప్స్‌ విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఆ సినిమా త‌ర్వాత ‘కేజీఎఫ్’ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31వ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ పాన్-ఇండియా మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 23న ప్రారంభం కానుంద‌ని ఆ సినిమా యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేసింది.

ఇందులో ఎన్టీఆర్ గుబురు గడ్డం కోరమీసంతో మోస్ట్ వైలెంట్‌గా మహా మాస్ అవతారంలో కనిపిస్తున్నారు. చెప్పాలంటే ఆయన కెరీర్‌లో ఇటువంటి మేకోవర్‌లో కనిపించడం ఇదే మొదటిసారి. ఇక ఈ పోస్టర్‌లో.. ‘రక్తంతో తడిసిన నేల మాత్రమే గుర్తుకు వస్తుంది.. ఆయన నేల.. ఆయన పాలన. అయితే, అది కచ్చితంగా ఆయన రక్తం కాదు’.. అని మేకర్స్ పేర్కొన్నారు. దీనిని బట్టి చూస్తుంటే కేజీఎఫ్ సిరీస్ కంటే రెండింతలు హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాగా ఎన్టీఆర్ 31 రూపొందనుందని అర్థమవుతుంది.

- Advertisement -