లండన్‌లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు..

667
- Advertisement -

ఎన్నారై టిఆర్‌ఎస్ యుకె శాఖ ఆధ్వర్యంలో లండన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస పార్టీ అధ్యక్షులు కేసీఆర్ 66వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్నారై టిఆర్‌ఎస్ యుకె అధ్యక్షుడు అశోక్ దూసరి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుండి భారీగా టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు,తెలంగాణ వాదులు మరియు ఇతర ప్రవాసులు హాజరయ్యారు.

ఎన్నారై టిఆర్‌ఎస్ ఆద్వర్యంలో జరిగిన వేడుకల్లో అధ్యక్షుడు అశోక్ దూసరి మాట్లాడుతూ.. కేసీఆర్ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా నిర్మించే క్రమంలో భగవంతుడు వారికి అన్ని సందర్భాల్లో మనోధైర్యాన్ని,ఆశీస్సులు అందించి ముందుకు నడిపించాలని వారంతా కోరుకున్నారు.

CM KCR birthday in London

ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి మాట్లాడుతూ మనం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం కెసిఆర్ గారు అహర్నిశలు కష్టపడుతున్నారని మరియు ఎన్నారై టిఆర్‌ఎస్ సెల్ కి కేసీఆర్,మాజీ ఎంపీ కవిత మరియు యావత్ టిఆర్‌ఎస్ నాయకులు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీ తెలంగాణ బిడ్డ కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచడం చారిత్రక అవసరమని తెలిపారు.

అడ్వైసరి బోర్డు వైస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. నేడు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు ఉందనీ,ఇతర రాష్ట్రాలకు ధీటుగా అభివృద్ధి సాధిస్తున్నదని అన్నారు.నేడు మిషన్ కాకతీయ,మిషన్ భగీరథ యావత్ భారతదేశానికే తలమానికంగా నిలవడం కేసీఆర్ గొప్పదనమని తెలిపారు.

CM-KCR

ఎన్నారై తెరాస ఐటి కార్యదర్శి వినయ్ ఆకుల మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు.టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కలుపుకొని,అందరి సూచనలను తీసుకొని ముందుకు వెళ్తుందని కాబట్టి ఎటువంటి సలహాలు, సందేశాలు వున్నా వ్యక్తిగతంగా గానీ సోషల్ మీడియా ద్వారా కానీ ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు అని తెలిపారు.

అనంతరం ఏర్పాటు చేసిన వేడుకల్లో, కేక్ కట్ చేసి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపి, ఎన్నో సంవత్సరాలుగా లండన్‌లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నామని తెలిపారు. కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ఎన్నారై టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు లండన్‌లో రక్తదానం చేశారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, వారి ఆశీస్సులతో మరిన్ని జన్మదిన వేడుకలను జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.

NRI TRS

లండన్‌లో వేడుకలే కాకుండా ప్రతి సంవత్సరం రాష్ట్రంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తామని, ఈ సంవత్సరం కూడా ఎన్నారై టిఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి రాజ్ కుమార్ శానబోయిన నాయకత్వంలో పలు సేవ కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. చివరిగా ఈవెంట్స్ ఇంచార్జ్ సత్యచిలుముల మరియు సంయుక్త కార్యదర్శి సురేష్ గోపతి మాట్లాడుతూ.. ఇలా వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, బంగారు తెలంగాణ నిర్మాణంలో కేసీఆర్ వెంటే ఉంటామని, హాజరైన కార్యవర్గ సభ్యులందరికి కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో అద్యక్షులు అశోక్ గౌడ్ దుసరి, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, అడ్విసోరీ బోర్డు వైస్ చైర్మన్ చంద్ర శేఖర్ గౌడ్, కార్యదర్శులు హరి బాబు, సత్యమూర్తి చిలుముల, సంయుక్త కార్యదర్శి సురేష్ గోపతి, అధికార ప్రతినిధులు రవి పులుసు, రవి రేతినేని, ఐటీ సెక్రటరీ వినయ్ ఆకుల, ఆరూరి విశాల్, దుసరి సాయి కుమార్ గౌడ్, జవహర్లాల్ రామావత్, కాసుల భరత్, వేణు వివేక్ చెరుకు, టిల్లీస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సుధీర్ రెడ్డి, ప్రణీత్, క్రాంతి పుట్ట,రాజ శేఖర్ రావు,అబ్దుల్లాహ్, ప్రణయ్, తరుణ్ రెడ్డి, సోహెల్ కహ్న్, కమల్, మనోహర్ మిట్ట, సయీద్ హాజరైన వారిలో వున్నారు.

- Advertisement -