నిర్భయ దోషులకు మార్చి 3న ఉరి ఖరారు..

432
Nirbhaya convicts
- Advertisement -

నిర్భయ కేసు నిందితుల ఉరి శిక్ష అమలులో గత కొంతకాలంగా పలు అసక్తికర పరిణామలు చోటు చేసుకుంటున్నాయి. నిర్భయ దోషులకు ఇదివరకే రెండు సార్లు డెత్‌ వారెంట్‌లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దోషులకు రెండు సార్లు ఉరిశిక్ష వాయిదా పడింది. ఈ నేపథ్యంలో దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ చేయాలన్న తీహార్ జైలు అధికారుల పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది.

తాజాగా సోమవారం నిర్భయ దోషులకు ఉరి శిక్ష తేదీ ఖరారైంది. నలుగురు దోషులకు కొత్త డెత్ వారెంట్ ను పటియాలా హౌస్ కోర్టు జారీ చేసింది. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా ఆదేశాలు జారీ చేశారు. మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకు తీహార్ జైలులో నలుగురికి ఒకేసారి ఉరి తీయనున్నారు.

కాగా, ఈ కేసు దాదాపు ఏడేళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది. దోషులకు శిక్ష అమలు విషయంలో వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తోంది. అటు దోషులు కూడా తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు ఉన్న న్యాయపరమైన అవకాశాలన్నింటినీ ఉపయోగించుకుంటూ తప్పించుకుంటూ వచ్చారు.

- Advertisement -