‘మట్కా’ కోసం హైదరాబాద్‌కు నోరా ఫతేహి!

28
- Advertisement -

వైవిధ్యమైన చిత్రాలతో అలరిస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన 14వ చిత్రాన్ని ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్‌ దర్శకత్వంలో చేస్తున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై మోహన్ చెరుకూరి , డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తుండగా దీనికి మట్కా అనే టైటిల్ ఖరారు చేశారు. 1958-1982 మధ్య జరిగే ఈ కథ వైజాగ్ నేపథ్యంలో జరుగుతుందట. వరుణ్ తేజ్ ని నాలుగు డిఫరెంట్ గెటప్ లలో చూపించనుండగా నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి ఎంపికయ్యారు.

తాజాగా ఈ సినిమా కోసం హైదరాబాద్‌కు చేరుకుంది నోరా ఫతేహి. ఈ చిత్రంలో తన లుక్ టెస్ట్ కోసం ఆమె వచ్చిందట. మరి నోరా లుక్ ఎలా ఉంటుందో చూడాలని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది వరుణ్ తేజ్‌కి మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.

Also Read:ఆ పాత్రల కోసం హీరోగారి కూతురు తాపత్రయం

- Advertisement -