గాంధీ ఆసుపత్రిలో నాన్ కోవిడ్ సేవలు ప్రారంభం..

29
gandhi

13 ఈ నెల 21(శనివారం) నుంచి గాంధీ ఆసుపత్రిలో కోవిడ్‌తో పాటుగా నాన్ కోవిడ్ సేవల అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు శనివారం నుండి ఆసుపత్రిలో అన్ని విభాగాలు ప్రారంభం అవుతున్నాయి. అన్ని రకాల సర్జరీలో ప్రారంభించనున్నారు. అయితే ఆసుపత్రికి వచ్చే వారి తగు జాగ్రతలు తీసుకోవాలి. ఆసుపత్రికి వచ్చే వారికి మాస్క్ లేకుండా అనుమతి ఉండదు. ఒక్క పేషెంట్ వెంబడి ఒక్క అటెండర్ మాత్రమే ఉండాలి. వారి మధ్య భౌతిక దూరం పాటించాలి. కాగా, ఆసుపత్రిలోకి రావడానికి కోవిడ్ వార్డ్స్ నాన్ కోవిడ్ సర్వీసెస్‌కు వేరువేరు మార్గాలు ఏర్పాటు చేశారు.