స్లాట్‌ లేకున్నా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌

2409
dharani
- Advertisement -

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన నేపథ్యంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ నిబంధనలను సడలించింది. ముందస్తు స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్నవారితోపాటు .. నేరుగా వచ్చినవారికి కూడా రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశించింది. అయితే స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారికి మొదటి ప్రాధాన్యమివ్వాలని సూచించింది. ఒక రిజిస్ట్రేషన్‌కు గరిష్ఠంగా ఐదుగురిని మాత్రమే అనుమతిస్తామని స్పష్టంచేశారు.

హైదరాబాద్‌ జనరల్‌ పోస్టాఫీస్‌ (జీపీవో)లో ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌, అప్‌డేషన్‌ సేవలు బుధవా రం నుంచి రోజూ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, వికలాంగులకు తొలి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.

- Advertisement -