Ponguleti:ధరణిని ప్రక్షాళన చేస్తాం

27
- Advertisement -

ధరణిని ప్రక్షాళన చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన..10 సంవత్సరాల తరువాత ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలు కోరుకున్నారని..
ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ఆరు గ్యారెంటీ లకు చట్ట బద్ధత ని కేబినెట్ సమావేశంలో తీసుకువచ్చాం అన్నారు. ఆరు గ్యారెంటీ లలో రెండు గ్యారెంటీ లను మొదటి రెండు రోజుల్లో అమలు చేసి చూపించామన్నారు. ఇవాళ కలెక్టర్స్ ,అదనపు కలెక్టర్స్ ,ఎస్పీ లతో సమావేశం అయ్యాం అని…సుదీర్ఘంగా సమావేశం జరిగిందన్నారు.

ఇందిరమ్మ రాజ్యం లో ప్రజల వద్దకే పాలన ప్రజా పాలన అని చెప్పిన విధంగా ఈ సమావేశంలో అద్భుత నిర్ణయం తీసుకున్నాం అని…డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం ఉంటుందన్నారు. అధికారుల ఒక టీం ప్రతి రోజు రెండు సమావేశాలు నిర్వహిస్తం అని..అర్హులైన ప్రతి వారికి ఇచ్చిన మాట ప్రకారం..వారి గుమ్మం వద్ద కి పాలన తీసుకెళ్తామన్నారు. అధికారులు చిన్నచూపు చూడకుండా ప్రభుత్వ అధికారులు చిన్న గూడెం అయిన, చెంచు గుండెమ్ వద్ద కి వెళ్ళాలన్నారు.

డ్రగ్స్ పై ఆదేశాలు ఇచ్చాం….గత ప్రభుత్వం ఇళ్ల కోసం రెండు రోజులు వెబ్సైట్ ఓపన్ చేసి క్లోజ్ చేశారన్నారు. గ్రామాల్లో కష్టాల్లో ఉన్న వారు.. అప్లై చేసుకోవాలని వారి నుంచి చిత్త శుద్దితో అప్లికేషన్ తీసుకుంటుందన్నారు. గత ప్రభుత్వం లో వన్ సైడ్ బ్యాటింగ్..రాజులా ఉండేవారు కానీ ఇది ప్రజల ప్రభుత్వం అన్నారు శ్రీనివాస్ రెడ్డి. గతంలో 32 శాతం..61 శాతం బస్ లలో మహిళలు ప్రయాణం చేస్తున్నారు..
స్కెమ్ రిజల్ట్ ని ఎప్పటి కప్పుడు తెలుసుకుంటున్నాం అన్నారు. ధరణి పోర్టల్ ద్వారా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారని…గత ప్రభుత్వం ఉన్న వాళ్ళు ప్రభుత్వ భూములు వారిపై చేసుకున్నారన్నారు. ధనిక రాష్ట్రంగా తెలంగాణ అప్పుల రాష్ట్రంగా చేశామని బీఆర్ఎస్‌ వాళ్లే ఒప్పుకున్నారన్నారు. మంచి గా ఉన్న సచివాలయం ఎందుకు వేరేది ఎందుకు కట్టారు..ముఖ్యమంత్రి కార్యాలయం కడితే అభివృద్దా ఆలోచించాలన్నారు. చేసిన అప్పులను కప్పిపుచ్చుకునేందుకే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

Also Read:KTR:కాళేశ్వరంపై విచారణకు సిద్ధం!

- Advertisement -