వాసాలమర్రికి సీఎం కేసీఆర్‌

138
cm kcr
- Advertisement -

జిల్లాల పర్యటనలో భాగంగా నేడు వాసాలమర్రిలో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. రోడ్డుమార్గంలో యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రికి చేరుకోనున్న సీఎం…3వేల మంది గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లుచేశారు.

గ్రామస్థులతో సమావేశంలో పాల్గొననున్న సీఎం కేసీఆర్…వారి సమస్యలపై చర్చించనున్నారు. సీఎం పాల్గొనే కార్యక్రమాల్లో కేవలం వాసాలమర్రి గ్రామస్తులే పాల్గొనేలా ప్రత్యేకంగా పాస్‌లను జారీచేశారు. ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాలశాఖ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

3 వేల మంది గ్రామస్తులు అందరూ కలిసి కూర్చొని సహపంక్తి భోజనాలు చేసేలా 20 ఎకరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు… మరో 20 ఎకరాల స్థలంలో గ్రామ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు…వర్షం వచ్చిన ఎలాంటి ఇబ్బంది లేకుండా రైన్ ప్రూఫ్ టెంట్ లను ఏర్పాటు చేశారు..స్వయానా సీఎం కేసీఆర్ తమ ఊరికి వచ్చి తమతో కలిసి సహపంక్తి భోజనాలు చేసి ,తమ గ్రామ అభివృద్ధి కి చర్యలు తీసుకోవడం తో గ్రామస్తుల ఆనందానికి అవధులు లేవు.. ఎవ్వరిని కదిలించిన అమితానందం వ్యక్తం అవుతున్నది.. తమకు అరుదైన అపూర్వమైన అవకాశం గా భావిస్తున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు…..ఎర్రవల్లి, చింత మడక, అంకాపూర్ లాగా తమ వాసాల మర్రి గ్రామము కూడా చరిత్రలో నిల్చిపోతుందని,, సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ ప్రేమ తో తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని గ్రామ యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు…..ఇప్పటికే ఉన్నతాధికారులు గ్రామంలో సర్వే చేపట్టి సామాజిక, ఆర్ధిక, భౌగోళిక స్థితిగతులను అధ్యయనం చేసి నివేదిక రూపొందించారు…నేడు సీఎం కేసీఆర్ గ్రామ సభ నిర్వహించి గ్రామ రూపురేఖలు మారేలా చర్యలు తీసుకోనున్నారు.

- Advertisement -