సొంత లాభం కోసమే కావాలనే వివాదం: చినజీయర్

73
swamy
- Advertisement -

తన వ్యాఖ్యలను కొంతమంది కావాలనే రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు చినజీయర్ స్వామి. ఆదివాసీ గ్రామ దేవతలను అవమానపరిచాననడం సరికాదు. మేం ఎలాంటి దురుద్దేశపూర్వక కామెంట్లు చేయలేదు. అవి 20 ఏళ్ల కిందటి కామెంట్లు. విమర్శించేవాళ్లు నా వ్యాఖ్యలపై పూర్వాపరాలు ఒకసారి పరిశీలించాలన్నారు.తన వ్యాఖ్యలను ఎడిటింగ్‌ చేసి తప్పుబట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఉక్రెయిన్‌ యుద్ధ హడావిడి తగ్గింది కాబట్టే పనికట్టుకుని నా వ్యాఖ్యలను తెర మీదకు తీసుకొచ్చినట్లు ఉన్నారు. ఆ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. అది సబబాకాదా అనేది వారి విచక్షణకే వదిలేస్తున్నాం అన్నారు.

అందర్నీ గౌరవించాలన్నదే మా విధానం. అలాగే అన్నీ నేను నమ్మాల్సిన అవసరం లేదు. వివాదంపై వారికే వదిలేస్తున్నా…మహిళలను చిన్నచూపు చూసేవాళ్లను ఎట్టిపరిస్థితుల్లో ప్రొత్సహించం అన్నారు.

- Advertisement -